సెట్స్ పైకి వచ్చిన విలన్ వాల్మీకి

చాన్నాళ్లకు దర్శకుడు హరీష్ శంకర్ మెగాఫోన్ పట్టుకున్నాడు. డీజే తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ డైరక్టర్ ప్రస్తుతం వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వగా, తాజాగా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వరుణ్ తేజ్ వచ్చి చేరాడు. ఈ సినిమాలో వరుణ్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్లస్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సెకెండ్ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత యూనిట్ అంతా కలిసి కొడైకెనాల్ వెళ్తుంది.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వస్తోంది వాల్మీకి. తన స్టయిల్ లో ఈ సినిమాకు మార్పుచేర్పులు చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం పూజా హెగ్డేను అనుకుంటున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూజా హెగ్డే కనిపిస్తుందట.