Telugu Global
NEWS

రాజధానిని గ్రాఫిక్స్‌లో నిర్మించారు.... అమరావతిలో కంపచెట్లు పెంచారు....

ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండగా రాజధాని, పోలవరం పై సమీక్షా సమావేశాలు ఎందుకు? అని ప్రశ్నించారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. 2016 సెప్టెంబర్‌ వరకు పోలవరాన్ని ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం, భూ కేటాయింపుల్లో అవినీతి జరగలేదా? అని ప్రశ్నించారు బుగ్గన. దోచుకోవడం కోసమే చాలా ప్రాజెక్టులను చేపట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరింది నిజంకాదా అని ప్రశ్నించారు. ఐదేళ్ళు రాజధానిని నిర్మించకుండా ఏం చేశారన్నారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో మాత్రమే నిర్మించారని…. అమరావతిలో […]

రాజధానిని గ్రాఫిక్స్‌లో నిర్మించారు.... అమరావతిలో కంపచెట్లు పెంచారు....
X

ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండగా రాజధాని, పోలవరం పై సమీక్షా సమావేశాలు ఎందుకు? అని ప్రశ్నించారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. 2016 సెప్టెంబర్‌ వరకు పోలవరాన్ని ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం, భూ కేటాయింపుల్లో అవినీతి జరగలేదా? అని ప్రశ్నించారు బుగ్గన. దోచుకోవడం కోసమే చాలా ప్రాజెక్టులను చేపట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరింది నిజంకాదా అని ప్రశ్నించారు.

ఐదేళ్ళు రాజధానిని నిర్మించకుండా ఏం చేశారన్నారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో మాత్రమే నిర్మించారని…. అమరావతిలో మాత్రం కంపచెట్లు మాత్రమే ఉన్నాయన్నారు.
రాజధాని పేరుతో కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రమే చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా రూ. 4 కోట్లు కేటాయిస్టే… వాళ్ళకు నచ్చిన ప్రైవేట్‌ సంస్థలకు మాత్రం ఎకరా రూ. 40 లక్షలకే కేటాయించారన్నారు.

పుష్కరాలకు రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అందరినీ ఏకం చేస్తానంటున్న చంద్రబాబుకు….. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకిందికి వస్తుందా? అని ప్రశ్నించారు.

మీ పాలనలో అవినీతి లేని ఒక్క అంశానైనా చూపిస్తారా? అని చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

టీడీపీ నేతలంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేశారని , విజయవాడ నడిబొడ్డున సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం పై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఐదేళ్ళలో పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారన్నారు.

సేవామిత్ర పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. హోంగార్డులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకుండా…. ఎన్నికల పథకాల కోసం ఖజానాలోని సొమ్మను తరలించారని… ఆ సొమ్మును ఓటర్లను ప్రభావితం చేయడానికే అటు మళ్ళించారన్నారు.

చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం పై మండిపడ్డారు బుగ్గన. చంద్రబాబు ప్రవర్తన ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్లు లేదన్నారు. ఆపద్ధర్మ సీఎం అత్యవసర సమయంలో మాత్రమే రివ్యూలు చేయాలన్న విషయం 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు తెలియక పోవడం విచిత్రం అన్నారు. ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా లేదన్నారు.

ఈవీఎం కేసులో నిందితుడుగా ఉన్న హరిప్రసాద్‌ను…. ఈసీకి పిర్యాదు చేయడానికి తీసుకెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. గెలుస్తామన్న తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేయడం ఎందుకు? అని మండిపడ్డారు బుగ్గన.

First Published:  19 April 2019 5:20 AM GMT
Next Story