చిత్రలహరి మొదటి వారం వసూళ్లు

ఎట్టకేలకు సాయితేజ్ హిట్ కొట్టాడు. 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన చిత్రలహరి, అతడి కెరీర్ కు ఆక్సిజన్ అందించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. నిన్నట్నుంచే లాభాల బాట పట్టింది.

నిన్నటితో విడుదలై వారం రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ సాధించింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 11 కోట్ల 42 లక్షల రూపాయల నెట్ వచ్చింది.

చిత్రలహరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్లతో బయ్యర్లంతా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ఇవాళ్టి నుంచి జెర్సీ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రావడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి చిత్రలహరి నుంచి ఎక్కువ లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది.

మొత్తానికి నామమాత్రపు లాభాలతో బయ్యర్లు బయటపడబోతున్నారు. అదే హ్యాపీ. ఏపీ, నైజాంలో వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 3.22 కోట్లు
సీడెడ్ – రూ. 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.50 కోట్లు
ఈస్ట్ – రూ. 0.92 కోట్లు
వెస్ట్ – రూ. 0.67 కోట్లు
గుంటూరు – రూ. 0.84 కోట్లు
కృష్ణా – రూ. 0.72 కోట్లు
నెల్లూరు – రూ. 0.34 కోట్లు