ఐపీఎల్ లో బెంగళూరు చావోబతుకో సమరం

  • కోల్ కతా వేదికగా రాత్రి 8 గంటలకు నైట్ రైడర్స్ కు రాయల్ చాలెంజ్ 
  • ఎనిమిదిమ్యాచ్ ల్లో 7 పరాజయాల విరాట్ కొహ్లీ టీమ్ 
  • ఎనిమిదిరౌండ్లలో 4 గెలుపు, 4 ఓటమితో కోల్ కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు… చావో బతుకో సమరానికి సిద్ధమయ్యింది. మూడు వరుస పరాజయాల తర్వాత తొలి గెలుపుకోసం తహతహలాడుతోంది.

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ తొమ్మిదోరౌండ్ సమరం…కోల్ కతాకు చెలగాటం, బెంగళూరుకు ప్లే ఆఫ్ సంకటంగా మారింది.

ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది రౌండ్లలో ఒక్క గెలుపు, ఏడు పరాజయాల రికార్డుతో… లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయిన బెంగళూరు… ప్లే ఆఫ్ రౌండ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే… ఈరోజు జరిగే మ్యాచ్ లో నెగ్గి తీరాల్సి ఉంది.

మరోవైపు… కోల్ కతా ఎనిమిది రౌండ్లలో నాలుగు గెలుపు, నాలుగు ఓటమి రికార్డుతో లీగ్ టేబుల్ ఆరోస్థానంలో నిలిచింది.
ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో బెంగళూరుపై కోల్ కతా 14-9 రికార్డుతో ఆధిక్యంలో కొనసాగుతోంది.