Telugu Global
Cinema & Entertainment

జెర్సీ పై 'తారక్' ట్వీట్

ఎంతో నమ్మకం తో నాని జెర్సీ సినిమాని చేసాడు. విడుదలకు ముందు నాని సినిమా విజయం పై చాలా విశ్వాసంగా ఉన్నాడు. నేడు సినిమా విడుదల అయ్యాక వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే నాని అంత విశ్వాసంగా ఉన్నాడో అర్ధం అవుతుంది. అలాగే ఈ సినిమా ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. నాని ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన చెప్పడం విశేషం. Bro @NameisNani , you have hit […]

జెర్సీ పై తారక్ ట్వీట్
X

ఎంతో నమ్మకం తో నాని జెర్సీ సినిమాని చేసాడు. విడుదలకు ముందు నాని సినిమా విజయం పై చాలా విశ్వాసంగా ఉన్నాడు. నేడు సినిమా విడుదల అయ్యాక వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే నాని అంత విశ్వాసంగా ఉన్నాడో అర్ధం అవుతుంది.

అలాగే ఈ సినిమా ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. నాని ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన చెప్పడం విశేషం.

“జెర్సీ ఒక ఔట్ స్టాండింగ్ సినిమా. సినిమా చూస్తున్నంత సేపు ఒక రోలర్ కోస్టర్ రైడ్ చేసిన అనుభూతి కలిగింది. మంచి కథ ని ఎంచుకొని దానిని అంతే బాగా చెప్పగలిగినందుకు దర్శకుడు గౌతమ్ కి హాట్స్ఆఫ్. అద్భుతం గా, అద్వితీయంగా ఈ సినిమా కథ ని చెప్పాడు దర్శకుడు. ఈ చిత్రానికి పని చేసిన నటీ నటులకి, సాంకేతిక నిపుణలందరికీ నా అభినందనలు. ప్రతి ఒక్కరు తమ పని తీరు తో దర్శకుడి విజన్ ని హైలైట్ అయ్యేలా పని చేశారు. నా సోదరుడు నాని ఈ సారి బాల్ ని పార్క్ అవతలకి గట్టిగా కొట్టాడు. తన నటన అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా నటించాడు. చాలా రోజులు నాని పెర్ఫార్మన్స్ ని నేను గుర్తు ఉంచుకుంటాను. నాని ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను” అని తారక్ ట్వీట్ చేసాడు.

తారక్ మాత్రమే కాకుండా…. చాలా మంది ప్రముఖులు ఈ సినిమా ని చూసి సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

First Published:  19 April 2019 7:18 AM GMT
Next Story