కళ్లుచెదిరే లాభాలు…. మజిలీ 2 వారాల వసూళ్లు

ఆల్రెడీ బ్రేక్-ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టింది మజిలీ సినిమా. సమ్మర్ లో తొలి పెద్ద సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీ ఆ అంచనాల్ని అందుకుంది.

నాగచైతన్య సమంత జంటగా నటించిన ఈ సినిమా నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకుంది. ఈ 14 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల 14 లక్షల రూపాయల నెట్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 28 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

నైజాం – రూ. 12.31 కోట్లు
సీడెడ్ – రూ. 4.22 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ 4.27 కోట్లు
ఈస్ట్ – రూ. 1.66 కోట్లు
వెస్ట్ – రూ. 1.40 కోట్లు
గుంటూరు – రూ. 1.96 కోట్లు
కృష్ణా – రూ. 1.81 కోట్లు
నెల్లూరు – రూ. 0.83 కోట్లు