Telugu Global
Health & Life Style

ఆరోగ్యాల పంట.... సపోట

వేసవికాలంలో దొరికే మరో అద్భుతమైన ఆరోగ్యదాయకమైన పండు సపోటా. దీనికి మరో పేరు చీకు. ఈ చెట్లు ఎక్కువగా వేడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస విభాగాలకు చెందింది. అంటే ఎక్కువ కాలరీలు ఉండే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. మిల్క్ షేక్స్ కి ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు.  ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక […]

ఆరోగ్యాల పంట.... సపోట
X

వేసవికాలంలో దొరికే మరో అద్భుతమైన ఆరోగ్యదాయకమైన పండు సపోటా. దీనికి మరో పేరు చీకు. ఈ చెట్లు ఎక్కువగా వేడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస విభాగాలకు చెందింది. అంటే ఎక్కువ కాలరీలు ఉండే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. మిల్క్ షేక్స్ కి ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు.

  • ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • సపోటా లో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
  • కంటి చూపును మెరుగుపరచడంలో సపోటా చాలా దోహదపడుతుంది.
  • శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సపోటాకు ఎక్కువగా ఉంది.
  • సపోటాలో ఉన్న క్యాల్షియం… ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది.
  • సపోటా వెంట్రుకలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
  • ప్రతిరోజు సపోటా తింటే కురులు బలంగా పెరుగుతాయి. అంతేకాదు చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
  • సపోటాలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను సపోటా నియంత్రిస్తుంది.
  • సన్ బర్న్స్ నుండి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
  • సపోటా లో ఉండే కాపర్, ఫాస్ఫరస్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది.
  • సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, అడ్రినల్ గ్రంధులు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
First Published:  18 April 2019 9:05 PM GMT
Next Story