బాల‌య్య చిన్న అల్లుడి టికెట్ కోసం అంత గొడ‌వ జ‌రిగిందా?

నందమూరి బాల‌కృష్ణ చిన్న అల్లుడు శ్రీ భ‌ర‌త్. విశాఖ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేశాడు. శ్రీ భ‌ర‌త్ తాత ఎంవివిఎస్ మూర్తి ఇటీవ‌లే అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు. ఆయ‌న గీతం విద్యాసంస్థ‌ల అధినేత‌. ఆయ‌న గతంలో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చ‌నిపోక‌ముందు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తాత ప్లేస్‌లో ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయాల‌ని శ్రీభ‌ర‌త్ అనుకున్నాడు. పొలిటిక‌ల్ ఎంట్రీపై మామ బాల‌కృష్ణ‌, భార్య తేజ‌స్విని ముందు తన ప్రతిపాదన పెట్టాడు.

అయితే బాల‌య్య ఈ విష‌యం చంద్ర‌బాబుతో చ‌ర్చించారో లేదో తెలియ‌దు. కానీ భ‌ర‌త్ ప్ర‌పొజ‌ల్ పెట్ట‌గానే ఇప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌ద్ద‌ని చెప్పారట‌. అంతేకాదు భార్య తేజ‌స్వినితో కూడా చెప్పించార‌ట‌. అయితే భ‌ర‌త్ విన‌లేదు. త‌న తండ్రితో పాటు మ‌రో తాత కావూరి సాంబ‌శివ‌రావుతో ఈ విష‌యం చెప్పాడట‌. వెంట‌నే వారు చంద్ర‌బాబు కోట‌రీకి కూడా హెచ్చరిక‌లు జారీ చేశార‌ట‌.

తాము ప్రెస్‌మీట్ పెట్ట‌బోతున్నామ‌ని…..సంచ‌ల‌న విష‌యాలు మీడియా ముందు చెబుతామ‌ని వారు వార్నింగ్‌లు ఇచ్చార‌ట‌. ఇలా బెదిరించినా చంద్ర‌బాబు అండ్ కో ముందు ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో శ్రీభ‌ర‌త్ రంగంలోకి దిగి శాంపిల్ గా కొన్ని మీడియా సంస్థ‌ల‌కు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. దాంట్లో తాను రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.

త‌న విష‌యం తేల్చక‌పోతే… తాత కావూరి సాంబ‌శివ‌రావుతో క‌లిసి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని భ‌ర‌త్ త‌న మామ‌య్య బాల‌య్య‌కు తేల్చి చెప్పాడట‌. దీంతో చేసేదేమిలేక భ‌ర‌త్ టికెట్ విష‌యం చంద్ర‌బాబుతో చెప్పి…ఇప్పించుకోచ్చార‌ట‌. అయితే అంత‌కుముందు విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాస‌రావును పంపి….విశాఖ నార్త్ నుంచి లోకేష్‌ను పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ గీశార‌ట‌. అయితే ఈ లోపే భ‌ర‌త్ అడ్డం తిర‌గడంతో…దీనిని సాకుగా చూపి గంటా త‌ప్పించుకున్నాడట‌.

అయితే భ‌ర‌త్‌ను ఓడించేందుకు ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప్లాన్ వేశాడు. భీమిలి నుంచి పోటీ చేస్తాడని అనుకున్న ల‌క్ష్మీనారాయ‌ణ‌ను జ‌న‌సేన నుంచి విశాఖ ఎంపీగా రంగంలోకి దింపాడు. టీడీపీ కేడ‌ర్ ఆయ‌నకు స‌పోర్టు చేసేలా చూశారు. దీంతో ఇప్పుడు శ్రీభ‌ర‌త్‌కు టికెట్ ఇప్పించి కూడా ఓడించబోతున్నారని తెలుస్తోంది. ఆయ‌న నాలుగో ప్లేస్‌కు ప‌రిమిత‌మైనా ఆశ్చర్యం లేదనే టాక్ విన్పిస్తోంది. రాబోయే రోజుల్లో శ్రీభ‌ర‌త్ ఏంచేస్తార‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.