ఇంతకీ తెలుగు ‘క్వీన్’ పరిస్థితి ఏమైనట్టు?

బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ‘క్వీన్’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని తెలుగు, తమిళం తో సహా నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో రీమేక్ చేయనున్నారు.

మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్, తమిళంలో కాజల్ నటిస్తుండగా తెలుగు వెర్షన్ అయిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మిగతా మూడు వెర్షన్ ల తో పోలిస్తే తెలుగు రీమేక్ బోలెడు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

మొదట ఈ సినిమాకు నీలకంఠ దర్శకుడిగా వ్యవహరించినప్పటికీ అతను సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా ముందుకు వచ్చాడు.

ఈ నాలుగు చిత్రాలకు సంబంధించిన టీజర్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుండి ఒకటి రెండు పాటలు తప్ప ఈ సినిమా నుంచి మరేమీ అప్ డేట్లు బయటకు రాలేదు. కనీసం ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

మరోవైపు చిత్రబృందం కూడా ఈ సినిమా ప్రమోషన్ లు ఇంకా మొదలు పెట్టడం లేదు. ఒకవైపు ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్న ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమాలో కనిపించనుంది.

కానీ ఈ సినిమా కు బజ్ అంతగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయ్యేలా అనిపిస్తుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

లేట్ అయ్యేకొద్ది సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ పరిస్థితుల్లో దర్శకనిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.