Telugu Global
NEWS

అప్పుడు ఏమంటారో మరి....

తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించింది. అప్పుడు ఇక్కడా పొద్దు పోయేదాకా పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి కూడా….. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో కూడా ఈ సీన్ రిపీట్ అయ్యింది. కానీ  దీనిని ఆధారంగా చేసుకుని టీడీపీ తనకూ అధికారం ప్రాప్తిస్తుందని కలలు కంటోంది. చంద్రబాబు కూడా దాదాపు అదే భ్రమల్లో ఉన్నారు. కానీ, తెలంగాణ ఎన్నికలకు, ఏపీ ఎన్నికలకూ రాజకీయ పరిస్థితులలో భారీ తేడా ఉంది. […]

అప్పుడు ఏమంటారో మరి....
X

తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించింది. అప్పుడు ఇక్కడా పొద్దు పోయేదాకా పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి కూడా….. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికలలో కూడా ఈ సీన్ రిపీట్ అయ్యింది. కానీ దీనిని ఆధారంగా చేసుకుని టీడీపీ తనకూ అధికారం ప్రాప్తిస్తుందని కలలు కంటోంది.

చంద్రబాబు కూడా దాదాపు అదే భ్రమల్లో ఉన్నారు. కానీ, తెలంగాణ ఎన్నికలకు, ఏపీ ఎన్నికలకూ రాజకీయ పరిస్థితులలో భారీ తేడా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురు లేని పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీలు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి.

ఏపీలో అలా కాదు కదా…అధికారంలో ఉన్న టీడీపీకి వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాదాపుగా సర్వేలన్నీ వైసీపీ గెలుపునే సూచిస్తున్నాయి. కానీ, టీడీపీ దీనిని అంగీకరించే పరిస్థితిలో లేదు. విజయం సాధిస్తామని చెబుతూనే, చంద్రబాబు ఈవీఎంల మీద అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇదేం రకం రాజకీయమో అర్థం కాదు.

ఒక్క ఏపీలోనే కాదు. ఢిల్లీకి వెళ్లి మరీ ఈవీఎంల పాట పాడుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆ నెపాన్ని ఈవీఎంల మీద నెట్టేయడానికి కావచ్చు. మరి టీడీపీ విజయం సాధిస్తే ఏమంటారో మరి…. ఒక్క విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత విచిత్రంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఒక్కోసారి తానేం మాట్లాడుతున్నాడో కూడా తనకు అర్థం కానంతగా….జూన్ ఎనిమిది దాకా తానే ముఖ్యమంత్రిని అనే మాటలు ఆ కోవకు చెందినవే.

మరో విషయం ఏంటంటే… ఎన్నికలకు ముందు చంద్రబాబు తానా అంటే తందానా అంటూ గాయి గాయి చేసిన తమ్ముళ్లు ఇప్పుడు మాత్రం అంతగా నోరు మెదపడం లేదు. ఏదేమైనా ప్రజాతీర్పు బయటకు వచ్చేదాకా ఏపీలో ఇంకెలాంటి సన్నివేశాలు కనిపిస్తాయో వేచి చూడాల్సిందే.

First Published:  19 April 2019 11:13 PM GMT
Next Story