Telugu Global
NEWS

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రెండో గెలుపు

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్… తొమ్మిదిరౌండ్లలో రెండో విజయం నమోదు చేసింది.కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన సమరంలో…ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 10 పరుగుల తేడాతో అధిగమించి ఊపిరిపీల్చుకొంది. ఈ కీలక మ్యాచ్ లో కోల్ కతా ముందుగా టాస్ నెగ్గి…ఫీల్డింగ్ ఎంచుకొంది.దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ […]

ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రెండో గెలుపు
X

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్… తొమ్మిదిరౌండ్లలో రెండో విజయం నమోదు చేసింది.కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన సమరంలో…ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 10 పరుగుల తేడాతో అధిగమించి ఊపిరిపీల్చుకొంది.

ఈ కీలక మ్యాచ్ లో కోల్ కతా ముందుగా టాస్ నెగ్గి…ఫీల్డింగ్ ఎంచుకొంది.దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీ, ఆల్ రౌండర్ మోయిన్ అలీ…స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించారు. సమాధానంగా 214 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మిడిలార్డర్ ఆటగాళ్లు నితీష్ రాణా 46 బాల్స్ లో 9 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 85, యాండ్రీ రసెల్ 25 బాల్స్ లో 2 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 65 పరుగుల స్కోర్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది.సెంచరీ హీరో విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.తొమ్మిదిరౌండ్లలో రెండు విజయాలు, 7 పరాజయాల రికార్డుతో 4 పాయింట్లు మాత్రమే సాధించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్…లీగ్ టేబుల్ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

కొహ్లీ 5వ శతకం…

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ…తన ఐపీఎల్ కెరియర్ లో ఐదో సెంచరీ సాధించాడు.కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నైట్ రైడర్స్ తో ముగిసిన హైస్కోరింగ్ ఫైట్ లో కొహ్లీ…
కేవలం 58 బాల్స్ లోనే 9 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగులు సాధించి అవుటయ్యాడు.
కేవలం కొహ్లీ శతకం కారణంగానే బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు
సాధించగలిగింది. అంతేకాదు…10 పరుగుల తేడాతో బెంగళూరు విజేతగా నిలవడం ద్వారా…వరుస పరాజయాలకు బ్రేక్ వేయగలిగింది.కొహ్లీ కెరియర్ లో ఇది ఐదో సెంచరీ కాగా…కెప్టెన్ గా అత్యధిక శతకాలు బాదిన ఐపీఎల్ క్రికెటర్ గా కొహ్లీ రికార్డుల్లో చేరాడు.

First Published:  20 April 2019 5:52 AM GMT
Next Story