Telugu Global
National

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు

2018లో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించాడని, తనపట్ల చాలా అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఓ 35 ఏళ్ళ మహిళ శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. ఆయనను తిరస్కరించినందుకు తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి బయటకు పంపించేశాడని… తన కుటుంబాన్ని, తనను ఇబ్బందులపాలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. సుప్రీం కోర్టులో జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతూ 22 మంది సుప్రీం కోర్టు జడ్జీలకు లేఖలు రాసింది . జస్టిస్‌ […]

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు
X

2018లో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించాడని, తనపట్ల చాలా అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఓ 35 ఏళ్ళ మహిళ శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. ఆయనను తిరస్కరించినందుకు తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి బయటకు పంపించేశాడని… తన కుటుంబాన్ని, తనను ఇబ్బందులపాలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

సుప్రీం కోర్టులో జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతూ 22 మంది సుప్రీం కోర్టు జడ్జీలకు లేఖలు రాసింది .

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అంటే కొందరు రాజకీయ పెద్దలకు మింగుడుపడడం లేదు. ఆ నేపధ్యంలో ఇలాంటి కేసు రూపుదిద్దుకుందా? అని కొందరు అనుమానిస్తున్నారు.

తనపై వస్తున్న ఆరోపణలను గొగోయ్ కొట్టిపారేశారు. తనను దెబ్బతీయడానికే తెరవెనుక కొన్ని శక్తులు ఈ ఆరోపణలు చేయిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ళ పాటు తాను న్యాయమూర్తిగా నిస్వార్ధంగా సేవలందించానని, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ ను అస్థిరపరచడానికే కొందరు ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.

First Published:  20 April 2019 2:52 AM GMT
Next Story