కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ షురూ

బుల్లి తెర పై యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి క్రమక్రమం గా ఒక మంచి నటి గా పేరు తెచ్చుకుంది కలర్స్ స్వాతి. పెద్దగా గ్లామరస్ పాత్రలు ఏమి చెయ్యకపోయినా నటన కి ఆస్కారం ఉన్న పాత్రలు చాలానే చేసింది స్వాతి. వాటితోనే మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మళయాళ భాషల్లో కూడా మెరిసి మంచి పేరు తెచ్చుకుంది. గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ చిత్రాలు మంచి విజయ సాధించాయి.

అయితే మొన్నామధ్య పెళ్లి చేసుకొని కొన్ని రోజులు నటన కి దూరం గా ఉంది స్వాతి. ప్రస్తుత ఫిలింనగర్ సమాచారం ప్రకారం స్వాతి తన రెండో ఇన్నింగ్స్ ని ఆరంభించేందుకు సిద్ధం అవుతుందట.

కార్తికేయ తో దర్శకుడి గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి ఇప్పుడు కార్తికేయ 2 ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిఖిల్ హీరో గా చేయనున్న ఈ సినిమా లో మళ్ళీ స్వాతినే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శకుడు.

స్వాతి తో పాటు సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందట. కానీ స్వాతి పాత్ర ఈ సినిమాలో ముఖ్యం అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.