Telugu Global
National

కాంగ్రెస్ ను ఊరిస్తున్న రాజదండం

ఏపీలో కాంగ్రెస్ దాదాపు సమాధి దశకు చేరుకుందనేది వాస్తవం. ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం డిపాజిట్లు సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ సంగతి పక్కనబెడితే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కాస్త బలపడే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సౌత్ లో బీజేపీ ఓట్లు రాల్చుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. ఇది కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. కర్ణాటక మీద ఆ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. జేడీఎస్ తో కలిసి బీజేపీ కన్నా ఎక్కువ […]

కాంగ్రెస్ ను ఊరిస్తున్న రాజదండం
X

ఏపీలో కాంగ్రెస్ దాదాపు సమాధి దశకు చేరుకుందనేది వాస్తవం. ఈసారి ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం డిపాజిట్లు సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ సంగతి పక్కనబెడితే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కాస్త బలపడే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సౌత్ లో బీజేపీ ఓట్లు రాల్చుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. ఇది కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.

కర్ణాటక మీద ఆ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. జేడీఎస్ తో కలిసి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లే సాధించగలమని నమ్ముతోంది. తెలంగాణలో రెండు లేదా మూడు సీట్లు రావచ్చని ఆశిస్తోంది. కేరళలోని వయనాడు నుంచి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ
రంగంలోకి దిగడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ అధిక సీట్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

తమిళనాడులో డీఎంకే సత్తా చాటగలిగితే కాంగ్రెస్ కు లాభం చేకూరవచ్ఛు. ఒడిశాలో బిజూ జనతాదళ్ తన పట్టును నిలుపుకొనే అవకాశం ఉంది. ఈ అన్ని రాష్టాలలో బీజేపీకి అంత సీన్ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఇది కాంగ్రెస్ కు ఊరటనిచ్చే అంశమే. రాహుల్ గాంధీ అధికార పీఠం అందుకునేందుకు సౌత్ లో వచ్చే సీట్లే కీలకంగా మారతాయనడంలో సందేహం లేదు.

అయితే ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ ఎంత ప్రభావం చూపుతుందనేది అనుమానమే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లు గెలుచుకోగలిగితే రాజదండం అందుకోవడానికి ఆ పార్టీకి మార్గం సుగమం అయినట్టే.

కాకపోతే మమతా బెనర్జీ,మాయావతి, కేజ్రీవాల్ తో మాత్రం తిప్పలు తప్పేలా లేవు. ఈ నాయకులు తమ తమ రాష్ట్రాలలో పట్టు నిలుపుకొని, కాంగ్రెస్ దరికి చేరడానికి ఆసక్తి చూపకపోతే రాహుల్ కు ఢిల్లీ గద్దె కలగానే మిగలవచ్చు. అప్పుడు మూడో ఫ్రంట్ అంశం మళ్లీ తెర మీదకు రావచ్చు. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి భంగపాటు తప్పకపోవచ్చు.

First Published:  19 April 2019 10:57 PM GMT
Next Story