జెర్సీ మొదటి రోజు వసూళ్లు

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ మొదటి రోజు ఈ సినిమా వసూళ్లు నాని రేంజ్ లో లేవు. దీనికి కారణం లిమిటెడ్ రిలీజ్ మాత్రమే. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇవాళ్టి నుంచి జెర్సీకి మరిన్ని థియేటర్లు, మరింత వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక వసూళ్ల విషయానికొస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 4కోట్ల 48 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ జెర్సీకి 7 కోట్ల 32 లక్షల రూపాయల నెట్ వచ్చింది. నాని గత చిత్రం కృష్ణార్జున యుద్ధంతో పోల్చుకుంటే ఈ వసూళ్లు ఎక్కువే. నాని ఓవరాల్ మార్కెట్ తో పోల్చి చూసుకుంటే తక్కువే.

కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు, లిమిటెడ్ రిలీజ్ కారణంగా వసూళ్లు ఇలా ఉన్నాయి. సినిమాను తక్కువ చేయడానికి ఎలాంటి రిమార్కులు లేవు. ఏపీ ,నైజాంలో జెర్సీ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.90 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.55 కోట్లు
ఈస్ట్ – రూ. 0.36 కోట్లు
వెస్ట్ – రూ. 0.29 కోట్లు
గుంటూరు – రూ. 0.41 కోట్లు
కృష్ణా – రూ. 0.34 కోట్లు
నెల్లూరు – రూ. 0.17 కోట్లు