ఆర్-ఆర్-ఆర్ కోసం భారీ యాక్షన్ సీన్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయం తెలిసిందే. అంతేకాదు, హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలే ఫైట్ సీక్వెన్స్ లతో ప్రారంభం అవుతాయట. త్వరలోనే ఆ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నాడు రాజమౌళి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా 2 యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేశాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారు. అంతేకాదు, ఈ ఇంట్రో సన్నివేశాల్లో భారీగా గ్రాఫిక్స్ కూడా వాడబోతున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్లు చాలా ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆర్-ఆర్-ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రో సీన్లు ఉండబోతున్నాయి.

జిమ్ లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతానికి ఈ సినిమా షెడ్యూల్ ను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తారు. ఆ షెడ్యూల్ లోనే హీరోలపై ఇంట్రడక్షన్ సీన్లు పిక్చరైజ్ చేయబోతున్నారు. రాజమౌళి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతోంది ఆర్-ఆర్-ఆర్ మూవీ.