Telugu Global
NEWS

సినీ గ్లామర్ ఫలించలేదా?

సినీ తారలు. తెలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో వారిదే హవా. వారు ప్రచారం చేసిన అభ్యర్థులు విజయం సాధించి తీరుతారని ఓ నమ్మకం. అందుకే ఎన్నికల క్షేత్రంలో నిలిచిన పలువురు సినీ తారలు, నిర్మాతలు తమకు బాగా సన్నిహితులైన నటీనటులను ప్రచారానికి తీసుకువచ్చి విజయం సాధించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజలు మరి తెలివి మీరారు. ఇవి గ్లామర్ కు పడిపోయే రోజులు కావంటూ ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్ […]

సినీ గ్లామర్ ఫలించలేదా?
X

సినీ తారలు. తెలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో వారిదే హవా. వారు ప్రచారం చేసిన అభ్యర్థులు విజయం సాధించి తీరుతారని ఓ నమ్మకం. అందుకే ఎన్నికల క్షేత్రంలో నిలిచిన పలువురు సినీ తారలు, నిర్మాతలు తమకు బాగా సన్నిహితులైన నటీనటులను ప్రచారానికి తీసుకువచ్చి విజయం సాధించేవారు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజలు మరి తెలివి మీరారు. ఇవి గ్లామర్ కు పడిపోయే రోజులు కావంటూ ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా ఇదే విషయం వెల్లడించారు తెలుగు ఓటర్లు.

తెలంగాణలో సినీ ప్రభావం లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం సినీ హీరోలు ఎన్నికల బరిలో నిలిచారు. వారి తరఫున ప్రచారం చేసేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ రాలేదు కానీ వారికి వారే ప్రచారం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన సినీ తారలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి, చిరంజీవి తమ్ముడు నాగబాబు నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆమెకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సినీ గ్లామర్ తో గట్టెక్కుతారు అనే నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. రాజకీయ నాయకురాలుగా ఆమె చేసిన అలుపెరగని పోరాటమే ఆమెను గెలిపిస్తుంది అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అనుకూలం కూడా రోజాకు పనికి వస్తుందని, ఈసారి ఎన్నికలలో ఆమె విజయం సాధించడం సాధ్యమేనని మరికొందరు చెబుతున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన గెలుపుపై నిరాశగా ఉన్నారంటున్నారు. ప్రచారంలో భాగంగా ఒకరిద్దరు అభిమానులు మెజారిటీ లక్ష దాటుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ మండిపడ్డారు. “ఇక్కడ గెలుస్తామో లేదో తెలియక ఇబ్బందులు పడుతుంటే మెజారిటీ అంటారేమిటి రా ” అంటూ కొట్టడానికి సైతం ముందుకు వచ్చారు. ఇదీ హిందూపురంలో బాలకృష్ణ పరిస్థితి.

రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా విజయం సాధించే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. భీమవరంలో గెలిస్తే రాజీనామా చేస్తాడని అక్కడి ఓటర్లు…. గాజువాక లో గెలిస్తే పవన్ కళ్యాణ్ సొంత గ్రామం ఉన్న భీమవరం నియోజకవర్గానికి వెళ్తారని గాజువాక ఓటర్లు భావించారని, అందుకే రెండు చోట్లా కళ్యాణ్ కి అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే చివరి నిమిషంలో భీమవరంలో లోకల్ గా ఉన్న డాక్టర్లు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు…. పవన్ కళ్యాణ్ ఓడిపోతే తమ సామాజిక వర్గం పరువు ఏం కావాలని వాళ్ళు రంగంలోకి దిగి విస్తృతంగా వాళ్ళ సొంత డబ్బు పంచారని, దాంతో పవన్ కళ్యాణ్ విజయావకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు.

ఆయన అన్న నాగబాబు పోటీచేసిన నరసాపురం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి ఆయన తట్టుకోలేక పోయారు అని వార్తలు వస్తున్నాయి. నరసాపురం నియోజకవర్గంలో నాగబాబు ఓటమి తప్పదని చెబుతున్నారు.

మొత్తానికి ఈ ఎన్నికలలో సినీ గ్లామర్ ఉంది గానీ గ్రామర్ మాత్రం పని చేయలేదని అంటున్నారు.

First Published:  19 April 2019 9:01 PM GMT
Next Story