మహేష్ 26 లో విజయ శాంతి పాత్ర ఇదే !

మహేష్ బాబు తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికీ అధికారికం గా వెల్లడింపబడలేదు కానీ ఇండస్ట్రీ లో అందరికీ ఈ సినిమా త్వరలో షూటింగ్ జరుపుకోబోతుందని అంటున్నారు. అనిల్ రావిపూడి మౌనం గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ ని పూర్తి చేసిన రావిపూడి, మెల్లగా ఒక్కొక్క నటుడిని ఫైనల్ చేస్తున్నాడట. అయితే సినిమా లో ముఖ్య పాత్రల కోసం ఇప్పటికే విజయ శాంతి, జగపతి బాబు, బండ్ల గణేష్ ని అప్రోచ్ అయ్యారట. ఉపేంద్ర ని కూడా తీసుకుందాం అనుకున్నారు కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుండి తప్పుకున్నారు.

అయితే విజయశాంతి ఈ సినిమా లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాచారం. సమాజం బాగు కోసం పరితపించే పాత్ర లో విజయ శాంతి కనిపించనుందట. అయితే ఈ సినిమా లో జగపతి బాబు కూడా కీలక పాత్ర చేయనున్నాడట.

ఒక ఫెరోషియస్ పాత్ర లో ఆయన మెరవనున్నారు. ఇంకా ఈ సినిమాలో మరి కొంత మంది నటులు కూడా మెరవనున్నారు అని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణం లో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశం ఉంది.