Telugu Global
NEWS

అధికారులకు " తమ్ముళ్ల" బిల్లుల సంకటం..!?

బహుశా దేశ చరిత్రలో పోలింగుకూ, కౌంటింగుకూ మధ్య ఇంత గ్యాప్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు. దాదాపు 45 రోజులు. ఈ సమయం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక రకమైన ఉత్కంఠను తెచ్చిపెడితే, అధికారులకు మరో రకమైన సంకటాన్పి తెచ్చి పెట్టింది, అభ్యర్థులు ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటుంటే, అధికారులు ఈ గడ్డు రోజులు ఎలా గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఏపీలోనే ఈ విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. […]

అధికారులకు  తమ్ముళ్ల బిల్లుల సంకటం..!?
X

బహుశా దేశ చరిత్రలో పోలింగుకూ, కౌంటింగుకూ మధ్య ఇంత గ్యాప్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు. దాదాపు 45 రోజులు. ఈ సమయం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఒక రకమైన ఉత్కంఠను తెచ్చిపెడితే, అధికారులకు మరో రకమైన సంకటాన్పి తెచ్చి పెట్టింది, అభ్యర్థులు ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటుంటే, అధికారులు ఈ గడ్డు రోజులు ఎలా గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఏపీలోనే ఈ విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దీనికి కారణం అధికార పార్టీ నేతల ఒత్తిడే అంటున్నారు. పెండింగులో ఉన్న తమ పనులు చేసి పెట్టమని, బిల్లులు విడుదల చేయమని వారుఅధికారుల వెంట పడుతున్నారట కొందరు అభ్యర్ధులు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారని అంటున్నారు.

ఈ పరిస్థితి ఒక్క రాజధాని అమరావతిలో ఉంటున్న ఉన్నతాధికారులకే కాదు. జిల్లాస్థాయి అధికారులకు, మండల స్థాయి వరకూ ఉందని అధికారులు కొందరు చెబుతున్నారు. కొందరు అధికారులు ఈ సమయంలో తాము ఎలాంటి పనులూ చేసి పెట్టలేమని తెగేసి చెబుతుంటే, కొందరు అధికారులు ఏకంగా కౌంటింగ్ వరకు సెలవులే పెట్టేస్తున్నారంటున్నారు. దీంతో తెలుగుదేశం నాయకులు తెల్ల మొహాలు వేస్తున్నారని అంటున్నారు. కొందరు మాత్రం బెదిరింపులకూ దిగుతున్నారట. పోలింగ్ జరిగిన నాలుగైదు రోజుల్లో కౌంటింగ్ కూడా జరిగి ఉంటే ఏ గొడవా లేకుండా పోయేదని అధికారులు వాపోతున్నారని చెబుతున్నారు. అసలే ఏపీ వ్యవహారాల మీద కేంద్ర ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది. పైగా
ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

ఈ సమయంలో తాము ఏదైనా ముందడుగు వేస్తే ఎటుపోయి ఎటు వస్తుందోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారట. దీంతో అమరావతిలో ఒక సంధి వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. సీఎం చంద్రబాబు వైఖరే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకుల మాట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ వారి పార్టీ సానుభూతిపరులు, నాయకులకే ఏ కాంట్రాక్ట్ అయినా దక్కేది. అలా అధికారులతో పనులు చేయించుకునే వారు. ఇప్పుడు అదే ఆ పార్టీ వారికి సంకటస్థితిని తీసుకువచ్చింది. వివిధ పనులకు సంబంధించిన బిల్లులు పాస్ కావాలంటే ఇంకా 45 రోజులు ఆగాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో…. బిల్లులు పాస్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని తెలుగు తమ్ముళ్లు తెగ హైరానా పడిపోతున్నారు.

First Published:  21 April 2019 2:32 AM GMT
Next Story