ఐపీఎల్ చరిత్రలో సెంచరీల మొనగాళ్లు

  • కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు బాదిన విరాట్ కొహ్లీ
  • 119 ఇన్నింగ్స్ లో 6 శతకాలతో క్రిస్ గేల్ టాప్
  • 164 ఇన్నింగ్స్ లో 5 సెంచరీల విరాట్ కొహ్లీ
  • 122మ్యాచ్ ల్లో 5 శతకాల డేవిడ్ వార్నర్

 

ఐపీఎల్ 12వ సీజన్లో…బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ…తొలి సెంచరీతో తన జట్టుకు విజయం అందించాడు. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసినమ్యాచ్ లో…సిక్సర్లు, బౌండ్రీలతో కొహ్లీ చెలరేగిపోయాడు. కెప్టెన్ గా ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడుగా నిలిచాడు.

సెంచరీల మోత…

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం…ఐపీఎల్ 12వ సీజన్లో…టీమిండియా కమ్…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ..తొలి శతకంతో తనజట్టుకు కీలక విజయం అందించాడు.
భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన ఈ డూ ఆర్ డై సమరంలో…కొహ్లీ… కెప్టెన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. కేవలం 58 బాల్స్ లోనే 9 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగుల స్కోరుకు
అవుటయ్యాడు.

12 సీజన్లు- ఐదు శతకాలు..

ప్రపంచక్రికెట్లోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా పేరున్న కొహ్లీకి…సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలోనే కాదు…టీ-20 ఫార్మాట్లో సైతం స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ సెంచరీల మోత మోగిస్తున్నాడు.
ఐపీఎల్ ..మొత్తం 12 సీజన్లలో ఆడుతూ వస్తున్న కొహ్లీ…ఐదవ సెంచరీ నమోదు చేయటం ద్వారా….అత్యధిక శతకాల హీరో క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు.గేల్ తన ఐపీఎల్ కెరియర్ లో …ఇప్పటి వరకూ ఆడిన 119 ఇన్నింగ్స్ లో 6 శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆరు సెంచరీల క్రిస్ గేల్….

గత సీజన్ వరకూ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఆడిన గేల్…ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ జట్టు లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలోనే గేల్ అత్యధికంగా… 12 వేల 670 పరుగులతో నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు.2009 సీజన్లో గేల్ పాంచ్ పటాకా…కేవలం 2009 సీజన్లోనే ఐదు సెంచరీలు బాదిన గేల్…ఆ తర్వాతి పది సీజన్లలో ఒకే ఒక్క శతకం సాధించడం విశేషం.బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సారథి కొహ్లీ…మొత్తం 164 ఇన్నింగ్స్ లో 5 సెంచరీలు సాధించాడు. ఇందులో …2016 సీజన్లోనే నాలుగు శతకాలు బాదటం విశేషం.

హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం…ఐదు ఐపీఎల్ సెంచరీలతో…కొహ్లీ సరసన నిలిచాడు. వార్నర్ మొత్తం 122మ్యాచ్ ల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.అంతేకాదు…రాజస్థాన్ రాయల్స్ మాజీఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ కు 125మ్యాచ్ ల్లో 4 సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ కు సైతం..149 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు సాధించిన ఘనత ఉంది.

విరాట్ కొహ్లీ టాప్…..

ఇక…ఐపీఎల్ లో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు.కెప్టెన్ గా ఐపీఎల్ లో ఒక్కో సెంచరీ సాధించిన క్రికెటర్లలో మాస్టర్ సచిన్, వార్నర్, గిల్ క్రిస్ట్, సెహ్వాగ్ సైతం ఉన్నారు.ఐపీఎల్ సెంచరీల హీరోలలో అత్యధిక వ్యక్తిగత ఆటగాడి రికార్డు మాత్రం..క్రిస్ గేల్ పేరుతోనే ఉంది. 2013 సీజన్లో …గేల్ …పూణే వారియర్స్ పై 66 బాల్స్ లోనే 175 పరుగులు సాధించడం…నాటికి నేటికీ చెక్కుచెదరని రికార్డుగా ఉంది.

 

ఆ తర్వాత…అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనత …బ్రెండన్ మెకల్లమ్ కు దక్కుతుంది. 2008 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై మెకల్లమ్ 158 పరుగుల స్కోరు సాధించాడు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే….వార్నర్, బెయిర్ స్టో, సంజు శాంసన్, రాహుల్, కొహ్లీ తలో శతకం బాదారు. మిగిలిన మ్యాచ్ ల్లో మరెన్ని సెంచరీలు నమోదవుతాయన్నదే ఇక్కడి అసలు పాయింట్.