Telugu Global
National

రాహుల్ భారతీయుడే కాదా? నామినేషన్ పై దుమారం!

ఇది వరకూ కూడా రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేశారు గెలిచారు. భారత పార్లమెంట్ లో సభ్యుడిగా వ్యవహరించారు. అమేథీ నుంచి ఆయన వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే అప్పుడంతా రాహుల్ గాంధీ పౌరసత్వం మీద రేగని దుమారం ఇప్పుడు రేగుతూ ఉండటం విశేషం. రాహుల్ నామినేషన్ పై పలు అభ్యంతరాలను చెబుతూ ఉన్నారు ప్రత్యర్థులు. ప్రత్యేకించి ఈ విషయంలో బీజేపీ ముందు ఉంది. అలాగే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా రాహుల్ గాంధీ నామినేషన్ […]

రాహుల్ భారతీయుడే కాదా? నామినేషన్ పై దుమారం!
X

ఇది వరకూ కూడా రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేశారు గెలిచారు. భారత పార్లమెంట్ లో సభ్యుడిగా వ్యవహరించారు. అమేథీ నుంచి ఆయన వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే అప్పుడంతా రాహుల్ గాంధీ పౌరసత్వం మీద రేగని దుమారం ఇప్పుడు రేగుతూ ఉండటం విశేషం. రాహుల్ నామినేషన్ పై పలు అభ్యంతరాలను చెబుతూ ఉన్నారు ప్రత్యర్థులు.

ప్రత్యేకించి ఈ విషయంలో బీజేపీ ముందు ఉంది. అలాగే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా రాహుల్ గాంధీ నామినేషన్ పై అభ్యంతరం తెలిపారు. రాహుల్ నామినేషన్లో లోటుపాట్లు ఉన్నాయని వారు అంటున్నారు. అది కూడా పౌరసత్వ వివాదం అని వారు చెబుతూ ఉన్నారు.

రాహుల్ కు బ్రిటిష్ పౌరసత్వం ఉందనేది వారి వాదన. రాహల్ ఇండియా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడేమో కానీ.. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని వారు అంటున్నారు. రాహుల్ ఒక బ్రిటిష్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారని, ఆ సంస్థ వెబ్ సైట్లో రాహుల్ ను బ్రిటిష్ పౌరుడుగా పేర్కొన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఆ వెబ్ సైట్లోనేమో రాహుల్ ను విదేశీ పౌరుడిగా పేర్కొంటూ, నామినేషన్ పత్రాల్లో మాత్రం ఆయన ఇండియన్ సిటిజన్ గా పేర్కొనడం ఏమిటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఈ విషయంలో స్పందించాలని వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇది వరకూ సోనియాగాంధీ మీద పౌరసత్వ వివాదాలు ఉండేవి. సోనియా విషయంలో బీజేపీ వాళ్లు దశాబ్దాల పాటు ఆమె ఇటాలియన్ అంటూ దుమారం రేపారు. ఇప్పుడు రాహల్ కు బ్రిటిష్ పౌరసత్వం ఉందనే వాదనను తెర మీదకు తెచ్చారు. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో!

First Published:  21 April 2019 1:22 AM GMT
Next Story