మరో ప్రతిష్టాత్మక చిత్రం లో సునీల్

వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలైన ఏ మాత్రం నిరాశ చెందకుండా అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సారి అయినా విజయ సాదించాలి అనే ధీమా తో అఖిల్ ముందు కదులుతున్నారు. ఈ సారి ఎలాగైనా అఖిల్ ని విజయ పథం వైపునకు నడపాలని ధీమా తో అల్లు అరవింద్ ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు.
బొమ్మరిల్లు సినిమా తో అరంగేట్రం చేసిన భాస్కర్ ఈ సినిమా కి దర్శకత్వం వహించనున్నాడు. ఒంగోలు గిత్త తర్వాత తెలుగు లో సినిమాలు మానేసిన భాస్కర్ కి ఇది ఒక రకం గా కంబాక్ అని చెప్పుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో పెద్ద కాస్టింగ్ ని అనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా లో నాయిక పాత్ర కోసం కైరా అద్వానీ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్న దర్శక నిర్మాతలు కామెడీ పండించడం కోసం సునీల్ ని ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకోనున్నారట.
సునీల్ ఇంతకు ముందు నాగార్జున తో, నాగ చైతన్య తో నటించాడు కానీ అఖిల్ తో నటించడం ఇదే మొదటి సారి. భాస్కర్ తో సునీల్ నటించినా చాలా కలం తర్వాత వీరు మళ్ళి ఒక్కటవ్వబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నది.