సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఆకాశవాణి కథ

రాజమౌళి కి తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తన అన్ని సినిమాల్లో కథ కీలకం గా ఉండే లా చూసుకుంటాడు ఈ దర్శకుడు. కథ పక్కా గా ఫైనల్ అయ్యాక మాత్రమే సినిమా ని సెట్స్ మీద కి తీసుకొని వెళ్తాడు రాజమౌళి.

ఇప్పుడు అదే బాట లో తన తనయుడు కూడా వెళ్తున్నాడు. అయితే రాజమౌళి కుమారుడు కార్తికేయా నిర్మాత గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా కి ఆకాశవాణి అనే పేరు ని కూడా ఖరారు చేశారు. కొత్త దర్శకుడిని ఈ చిత్రం తో పరిచయం చేస్తున్న కార్తికేయ కథ ఒకే అయ్యాక మాత్రమే సినిమా ని అనౌన్స్ చేసాడు.

‘ఈగ’, ‘బహుబలి’ వంటి చిత్రాలకు రాజమౌళి కి అసిస్టెంట్‌గా పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అనుకోకుండా ఆకాశం నుండి ఒక రేడియో ఓ గిరిజన తెగ ఉండే అడవిలో పడుతుందట.

ఆ ప్రాంతం లో నివసించే మనుషులకి రేడియో అంటే ఏంటి తెలియక పోవడం తో దానిని వారు వింతగా చూడడం మొదలు పెడతారట. అలాంటి సమయం లో వారు చేసే ఫన్నీ సంఘటనలు ఈ సినిమాకి కీలకం అని ఫిలింనగర్ లో టాక్. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉంది.