Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సరసన సూపర్ హిట్ హీరోయిన్

వరుసగా 3 సినిమాలు చేశాడు. మూడూ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. పైగా అక్కడున్నది అల్లు అరవింద్. అందుకే అఖిల్ పై ఈసారి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తనే దగ్గరుండి హీరోయిన్ ను సెట్ చేశారు. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ రష్మిక. అవును.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా అఖిల్ చేయబోయే సినిమాలో అతడి […]

అఖిల్ సరసన సూపర్ హిట్ హీరోయిన్
X

వరుసగా 3 సినిమాలు చేశాడు. మూడూ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. పైగా అక్కడున్నది అల్లు అరవింద్. అందుకే అఖిల్ పై ఈసారి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తనే దగ్గరుండి హీరోయిన్ ను సెట్ చేశారు. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ రష్మిక.

అవును.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా అఖిల్ చేయబోయే సినిమాలో అతడి సరసన హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. నిజానికి రష్మిక ఇప్పుడు చాలా బిజీగా ఉంది. మహేష్-అనీల్ రావిపూడి సినిమాకు కాల్షీట్లు ఇచ్చింది. అయినప్పటికీ అడిగింది అల్లు అరవింద్ కాబట్టి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమాలో కైరా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. మొదట ఆమెతోనే చర్చలు జరిపారు కూడా. కానీ రీసెంట్ గా వినయ విధేయ రామ సినిమాతో కైరా ఫ్లాప్ ఇచ్చింది. పైగా ఇప్పుడామె దృష్టి బాలీవుడ్ సినిమాలపై కూడా ఉంది. అందుకే ఆమె స్థానంలో రష్మికను ఎంపిక చేశారు. అన్నట్టు ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నాడు. అఖిల్ పక్కన కామెడీ పండించే బాధ్యతను సునీల్ తీసుకున్నాడు.

First Published:  21 April 2019 9:24 PM GMT
Next Story