Telugu Global
NEWS

"దేశం" నేతలతో చంద్రబాబు కీలక భేటీ ఎందుకు ?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులను పూర్తి వివరాలతో రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈనెల 11న ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు రోజులకు ఒకసారి పార్టీ నేతలతోను, అభ్యర్థులతోనూ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సోమవారం నాడు భేటీకి వివరాలతో రావాలంటూ ఆదేశించడం పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రతి […]

దేశం నేతలతో చంద్రబాబు కీలక భేటీ ఎందుకు ?
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులను పూర్తి వివరాలతో రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఈనెల 11న ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు రోజులకు ఒకసారి పార్టీ నేతలతోను, అభ్యర్థులతోనూ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సోమవారం నాడు భేటీకి వివరాలతో రావాలంటూ ఆదేశించడం పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రతి రోజూ జరిపే టెలీ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న చంద్రబాబు నాయుడు మళ్లీ ఎందుకు రమ్మన్నారంటూ పార్టీ నాయకులు, అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.

ఫలితాలు రావడానికి సరిగ్గా నెలరోజుల ముందు నిర్వహిస్తున్న ఈ కీలక భేటీలో విజయావకాశాలు ఎవరెవరికి ఉన్నాయి.. ఎన్ని స్థానాలలో పరాజయం పాలవుతారని తెలుసుకునేందుకే ఆహ్వానించారని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.

శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతుందని ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు చంద్రబాబు నాయుడు స్వయంగా చేయించుకున్న సర్వేల్లో తేలింది అంటున్నారు. అయితే అభ్యర్థులు తమ విజయావకాశాలపై తనతో నేరుగా చర్చించడం, వారి అంచనాల మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

ఈ కీలక భేటీ అనంతరం జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎలాంటి పాత్ర పోషించాలో కూడా నిర్ణయిస్తారని, లోక్ సభ ఎన్నికలలో కూడా పరాజయం పాలైతే పరిస్థితి ఏమిటనే అంశంపై చర్చించేందుకే చంద్రబాబు పార్టీ నాయకులను ఆహ్వానించినట్లు గా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

అధికారంలోకి రాకపోతే రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, తన కుమారుడు నారా లోకేష్ కు పార్టీ నాయకులు ఏ విధంగా సహకరించాలి అనే అంశంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారా అనే అనుమానాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు తేలడానికి సరిగ్గా నెలరోజుల ముందు జరుగుతున్న ఈ కీలక భేటీపై తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

పలు అంశాలపై చర్చిస్తున్న చంద్రబాబు నాయుడు అభ్యర్థులను, పార్టీ నాయకులను నేరుగా వివరాలతో రావాలని ఆదేశించడం వెనుక పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉందని చెబుతున్నారు.

First Published:  22 April 2019 12:13 AM GMT
Next Story