Telugu Global
NEWS

ఐపీఎల్ సూపర్ సండే ఫైట్ లో బెంగళూరు థ్రిల్లింగ్ విన్

చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక్క పరుగుతో గెలుపు ధోనీ తుదివరకూ పోరాడినా చెన్నైకి తప్పని ఓటమి ఐపీఎల్ సూపర్ సండే థ్రిల్లర్లో…. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై…బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సంచలన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఈ సూపర్ డూపర్ ఫైట్ లో… బెంగళూరు ఒకే ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 10వ రౌండ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన […]

ఐపీఎల్ సూపర్ సండే ఫైట్ లో బెంగళూరు థ్రిల్లింగ్ విన్
X
  • చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక్క పరుగుతో గెలుపు
  • ధోనీ తుదివరకూ పోరాడినా చెన్నైకి తప్పని ఓటమి

ఐపీఎల్ సూపర్ సండే థ్రిల్లర్లో…. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై…బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సంచలన విజయం సాధించింది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ఈ సూపర్ డూపర్ ఫైట్ లో… బెంగళూరు ఒకే ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది.

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 10వ రౌండ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు సాధించింది.

162 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన చెన్నై ని…కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ…విజయం అంచుల వరకూ తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

ధోనీ కేవలం 48 బాల్స్ లోనే 7 సిక్సర్లు, 5 బౌండ్రీలతో…. 84 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. చివరకు చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ప్రస్తుత సీజన్లో బెంగళూరుకు ఇది మూడో విజయం కాగా… చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా రెండో ఓటమి. బెంగళూరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పార్థివ్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిక్సర్ల బాదుడులో ధోనీ రికార్డు…

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా…చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల్లో చేరాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా…రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన… సూపర్ సండే ఫైట్ లో…ధోనీ ఈ ఘనత సాధించాడు.

కేవలం 48 బాల్స్ లోనే ధోనీ 7 భారీ సిక్సర్లు, 5 బౌండ్రీలతో 84 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అత్యధికంగా…కింగ్స్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ 323 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆ తర్వాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ 204 సిక్సర్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ధోనీ 203 సిక్సర్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

First Published:  22 April 2019 5:50 AM GMT
Next Story