Telugu Global
Cinema & Entertainment

జెర్సీని ఊహించని దెబ్బ కొట్టిన లారెన్స్

సోలో రిలీజ్ అంటూ సంబరపడింది జెర్సీ యూనిట్. తెలుగు నుంచి మరో పెద్ద సినిమా బరిలో లేదని ఆనందించింది. కానీ డబ్బింగ్ సినిమా రూపంలో దెబ్బ పడుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. అవును.. నాని నటించిన జెర్సీ సినిమాను లారెన్స్ తీసిన కాంచన-3 సినిమా దెబ్బకొట్టింది. మల్టీప్లెక్సుల్లో జెర్సీదే హవా అయినప్పటికీ, బి-సి సెంటర్లలో జెర్సీకి గట్టి పోటీనిస్తోంది కాంచన-3. నిన్నటితో ఈ రెండు సినిమాలు ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్నాయి. బి, సి సెంటర్ల వసూళ్లు […]

జెర్సీని ఊహించని దెబ్బ కొట్టిన లారెన్స్
X

సోలో రిలీజ్ అంటూ సంబరపడింది జెర్సీ యూనిట్. తెలుగు నుంచి మరో పెద్ద సినిమా బరిలో లేదని ఆనందించింది. కానీ డబ్బింగ్ సినిమా రూపంలో దెబ్బ పడుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు.

అవును.. నాని నటించిన జెర్సీ సినిమాను లారెన్స్ తీసిన కాంచన-3 సినిమా దెబ్బకొట్టింది. మల్టీప్లెక్సుల్లో జెర్సీదే హవా అయినప్పటికీ, బి-సి సెంటర్లలో జెర్సీకి గట్టి పోటీనిస్తోంది కాంచన-3.

నిన్నటితో ఈ రెండు సినిమాలు ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్నాయి. బి, సి సెంటర్ల వసూళ్లు చూస్తే.. కొన్ని చోట్ల జెర్సీ కంటే కాంచన-3 చూసేందుకే ఎక్కువమంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

కాంచన, గంగ సినిమాలు హిట్ అవ్వడం ఆ క్రేజ్ ఈ సీక్వెల్ కు కలిసొచ్చింది. దీనికి తోడు సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బి, సి సెంటర్ ఆడియన్స్ కు నచ్చాయి. అలా విడుదలైన 3 రోజుల్లో జెర్సీకి ఏమాత్రం తీసిపోని విధంగా 9 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ సాధించింది కాంచన-3. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 3.05 కోట్లు
సీడెడ్ – రూ. 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.96 కోట్లు
ఈస్ట్ – రూ. 0.75 కోట్లు
వెస్ట్ – రూ. 0.51 కోట్లు
గుంటూరు – రూ. 0.85 కోట్లు
కృష్ణా – రూ. 0.69 కోట్లు
నెల్లూరు – రూ. 0.32 కోట్లు

First Published:  22 April 2019 2:40 AM GMT
Next Story