Telugu Global
Cinema & Entertainment

స్టోరీ రైటరా... లేక గ్యాంగ్ లీడరా?

హీరో నాని తన కొత్త చిత్రం జెర్సీ తో అభిమానులని, ప్రేక్షకులని మెప్పించాడు.ఈ సినిమా విడుదల అయ్యి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సేస్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే రెట్టింపు ఉత్సాహం తో నాని ఇప్పుడు తన తదుపరి చిత్రాలని చేయనున్నాడు. ఇందులో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కాగా, మరొకటి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో ఉండబోతుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చే సినిమా […]

స్టోరీ రైటరా... లేక గ్యాంగ్ లీడరా?
X

హీరో నాని తన కొత్త చిత్రం జెర్సీ తో అభిమానులని, ప్రేక్షకులని మెప్పించాడు.ఈ సినిమా విడుదల అయ్యి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సేస్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే రెట్టింపు ఉత్సాహం తో నాని ఇప్పుడు తన తదుపరి చిత్రాలని చేయనున్నాడు. ఇందులో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కాగా, మరొకటి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో ఉండబోతుంది.

విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో వచ్చే సినిమా కి గ్యాంగ్ లీడర్ అని టైటిల్ కూడా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఇందులో నాని ఒక ఆసక్తికర పాత్ర లో కనిపించనున్నాడట. దర్శకుడు విక్రమ్ ఒక మనోరంజకమైన పాత్ర ని నాని కోసం డిజైన్ చేసాడట.

ఈ సినిమా లో నాని కథా రచయిత గా కనిపిస్తాడట. ఆ పాత్ర లో నాని పండించే కామెడీ ఈ సినిమా కి హైలైట్ గా ఉంటుందని చెప్తున్నారు చిత్ర యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం లో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలయింది. జెర్సీ విడుదల తో కాస్త ఫ్రీ అయిన నాని ఇప్పుడు ఈ సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు.

First Published:  22 April 2019 12:21 AM GMT
Next Story