నానిపై హాట్ కామెంట్ చేసిన విజయ్

సినిమా కోసం గడ్డాలు, మీసాలు , జుట్టు పెంచుకొని కష్టపడుతారు.. కొందరు హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ఒళ్లు హూనం చేసుకుంటారు. కథ డిమాండ్ చేసిందని విక్రమ్ లాంటి హీరో ‘ఐ’ సినిమాలో పళ్లు కూడా పీకించుకున్నారన్న టాక్ బయటకు వచ్చింది. అంతటి కష్టం సినిమా హిట్ అయితే పోతుంది.

ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కి హీరో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు… జెర్సీ కోసం నేర్చుకున్న క్రికెట్ తెరపై అద్భుతంగా ఆవిష్కృతమైంది. సినిమా ఘనవిజయం సాధించడం నాని పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.

తాజాగా విజయ్ దేవరకొండ నిన్న రాత్రి షో చూసి ‘జెర్సీ’ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.. నానిని ఎలా అభినందించాలో కూడా తెలియడం లేదని ప్రశంసలు కురిపించారు. ఇంత మంచి కథను సూపర్ గా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ ను మెచ్చుకున్నారు.

ఇక జెర్సీలో అచ్చం క్రికెటర్ లా షాట్లు కొట్టి అలరించిన నాని నటనకు ఫిదా అయిన విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో ఈ మేరకు చేసిన పోస్టు వైరల్ గా మారింది.

సినిమా కోసం క్రికెట్ నేర్చుకొని నాని ఓ స్టార్ బ్యాట్స్ మెన్ లా తయారయ్యాడని.. అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టుకు ఆడితే మంచిదని విజయ్ సలహా ఇచ్చారు.

ఇలా నాని సినిమా కోసం జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే స్థాయికి నేర్చుకున్నాడని.. కష్టపడ్డాడని విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.