మరో 10 రోజుల్లో సాహో పూర్తి

దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న సాహో సినిమా ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. ముంబయిలో సాహో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. 10 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు.

అయితే ఇక్కడ యూనిట్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ ను అలానే కొన్ని రోజులపాటు ఉంచాలని నిర్ణయించారు. ముంబయి షెడ్యూల్ అయిన తర్వాత కూడా ఏమైనా ప్యాచ్ వర్క్ పనులు ఉంటే ఆ సెట్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు. సో.. ముంబయి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది.

మొత్తానికి ఎలాగోలా ఈ నెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటి వారానికి సాహో షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని నిర్ణయించుకుంది యూనిట్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్స్ క్లూజివ్ గా 2 నెలల టైమ్ కేటాయించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో, ఆ రేంజ్ లో తీసిన ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది సాహో.