Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు కాంపౌండ్ లోకి జెర్సీ హీరోయిన్ !

జెర్సీ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. కన్నడ లో యు టర్న్ సినిమా తో అరంగేట్రం చేసిన శ్రద్ధ, ఆ తర్వాత అనేక కన్నడ సినిమాలలో నటించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా మెరిసిన శ్రద్ధ ఇప్పుడు జెర్సీ విజయం తో అందరి దృష్టి ని ఆకర్షించింది. జెర్సీ లో శ్రద్ధ ని చూసిన చాలా మంది ఈ భామ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ […]

దిల్ రాజు కాంపౌండ్ లోకి జెర్సీ హీరోయిన్ !
X

జెర్సీ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. కన్నడ లో యు టర్న్ సినిమా తో అరంగేట్రం చేసిన శ్రద్ధ, ఆ తర్వాత అనేక కన్నడ సినిమాలలో నటించింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా మెరిసిన శ్రద్ధ ఇప్పుడు జెర్సీ విజయం తో అందరి దృష్టి ని ఆకర్షించింది.

జెర్సీ లో శ్రద్ధ ని చూసిన చాలా మంది ఈ భామ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా సినిమా ఆఫర్ కూడా ఇచ్చేశాడన్న వార్తలొస్తున్నాయి. తన సొంత బానర్ లో త్వరలో నాగ చైతన్య తో చేయనున్న ఒక చిత్రం లో శ్రద్ధ ని హీరోయిన్ గా తీసుకోవాలని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కి శశి కుమార్ అనే నూతన దర్శకుడు పని చేయనున్నాడు. అయితే ఈ సినిమా మొదట మహేష్ బావ జయ్ దేవ్ కుమారుడు అశోక్ తో చేయాల్సింది. కొన్ని కారణాల వలన అది ఆగిపోయి ఇప్పుడు నాగ చైతన్య దగ్గరకి వచ్చింది ప్రాజెక్ట్. ఈ సినిమా తో పాటు దిల్ రాజు మరో రెండు సినిమాలు కూడా శ్రద్ధ కి ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

First Published:  22 April 2019 2:23 AM GMT
Next Story