జెర్సీ చూసి ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్

చాలా కాలం గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని ప్రకటించాడు. అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాక ముందే, త్రివిక్రమ్ తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ తో ఒక సినిమా చేస్తాడని ప్రకటన కూడా చేశాడు.

ఈ రెండు చిత్రాల పై బన్నీ అభిమానులకి చాలా ఆశలే ఉన్నాయి. త్రివిక్రమ్ తో ఇంతకు మునుపే బన్నీ రెండు సినిమాలు చేయడం తో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని అందరి అంచనా.

అయితే వేణు తో బన్నీ సినిమా మాత్రం అందరికీ పెద్ద ఆశ్చర్యం అని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. అయితే ఐకాన్ అనే పేరు తో వస్తున్న ఈ చిత్రం లో రోడ్ ట్రావెల్స్ బ్యాక్ డ్రాప్  లో ఒక లవ్ స్టోరీ ఉంటుందని సమాచారం.

అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషాదంతో ముగుస్తుందట. ఆవిధంగానే దర్శకుడు కథ రాసుకున్నాడట. అల్లు అర్జున్ తో సహా అందరూ అది వర్క్ అవుట్ అవుతుందా లేదా అని చర్చలు చేస్తున్న సమయం లో జెర్సీ సినిమా లో ఆ ట్రాజెడీ ని జనాలు ఇష్టపడడం బన్నీ ని ఆలోచింప చేసిందట. వెంటనే దర్శకుడితో అదే క్లైమాక్స్ తో సినిమా తీద్దామని చెప్పాడట. ఈ ఏడాది చివరలో ఐకాన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.