Telugu Global
Cinema & Entertainment

'ఆర్ఆర్ఆర్' సినిమాకి నో చెప్పిన శ్రద్ధకపూర్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ డైజి ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో తప్పుకోవడంతో ఈసారి ఆమె పాత్రలో  శ్రద్ధ కపూర్ లేదా పరిణీతి […]

ఆర్ఆర్ఆర్ సినిమాకి నో చెప్పిన శ్రద్ధకపూర్
X

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ డైజి ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో తప్పుకోవడంతో ఈసారి ఆమె పాత్రలో శ్రద్ధ కపూర్ లేదా పరిణీతి చోప్రా ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట.

ఈ నేపథ్యంలో స్టార్ బ్యూటీ శ్రద్ధకపూర్ ని ఈ సినిమా కోసం అడగగా ఆమె వచ్చే ఏడాది వరకు బిజీగా ఉందని తన దగ్గర డేట్లు ఖాళీగా లేవని చెప్పి తిరస్కరించిందట. ఈమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా ని సంప్రదించారు. కానీ ఆమె సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రను పోషించడం కోసం పరిణీతి బాడ్మింటన్ లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ మధ్యనే డెంగ్యూ నుంచి కోలుకున్న పరిణీతి సైనా నెహ్వాల్ పాత్ర కోసం బాగా తీవ్రంగా ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇలా వీరిద్దరూ కూడా నో చెప్పటంతో మళ్లీ వెతుకులాట మొదలుపెట్టారు దర్శకనిర్మాతలు.

First Published:  23 April 2019 3:17 AM GMT
Next Story