Telugu Global
NEWS

స్థానికం.... కారుకు వ్యతిరేకమేనా?

తెలంగాణలో ఎన్నికల మీద ఎన్నికలు వస్తున్నాయి. ముందస్తు శాసన సభ ఎన్నికలు ముగిసాయి. అక్కడ విజయం దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికలపై కన్నేసింది. ఈ హడావుడి మొదలవుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరతీసింది. ఇప్పుడు లోక్ సభ ఫలితాలు రాకుండానే స్దానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టింది. ఇలా వరుస ఎన్నికలతో తెలంగాణలో ఆరు నెలలుగా ఎన్నికల పండుగ జరుగుతోంది. శాసనసభకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు బొక్కబోర్ల పడింది. […]

స్థానికం.... కారుకు వ్యతిరేకమేనా?
X

తెలంగాణలో ఎన్నికల మీద ఎన్నికలు వస్తున్నాయి. ముందస్తు శాసన సభ ఎన్నికలు ముగిసాయి. అక్కడ విజయం దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికలపై కన్నేసింది. ఈ హడావుడి మొదలవుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరతీసింది.

ఇప్పుడు లోక్ సభ ఫలితాలు రాకుండానే స్దానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టింది. ఇలా వరుస ఎన్నికలతో తెలంగాణలో ఆరు నెలలుగా ఎన్నికల పండుగ జరుగుతోంది. శాసనసభకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు బొక్కబోర్ల పడింది. అధికారికంగా అభ్యర్దులను ప్రకటించకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి పాలైన వారంతా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులే. తాజాగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కారుకు దెబ్బతగులుతుందా అని చర్చ జరుగుతోంది.

ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాయ చేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ మాయ కారణంగానే తిరిగి అధికారంలోకి వచ్చారంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించాయి.

అయితే ఇప్పుడు జరుగునున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారనే జరుగుతున్నాయి. ఇది తమకు మేలు చేస్తుందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఆశాలు పెట్టుకున్నాయి.

శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత ఎక్కువైందని, బ్యాలెట్ పత్రాల ద్వారా అది వెల్లడి అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

స్థానిక ఎన్నికలు కారుకు ఎగనామం పెడతాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఆశిస్తున్నాయి. గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల వ్యతిరేకత తీవ్రమైందని, అది తమకు అనుకూలిస్తుందని ఆశిస్తున్నాయి.

First Published:  23 April 2019 3:55 AM GMT
Next Story