Telugu Global
Cinema & Entertainment

'సైరా'లో అనుష్క?

ప్రస్తుతం మెగా అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్వీటీ అనుష్క కు ఒక ముఖ్య […]

సైరాలో అనుష్క?
X

ప్రస్తుతం మెగా అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఒకటి. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్వీటీ అనుష్క కు ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అనుష్క కు దక్కిన పాత్ర ఒక నెరేటర్ పాత్ర అని…. తన పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని సినిమా మొదట్లో అందరికీ పరిచయం చేస్తుందని తెలుస్తుంది. అయితే అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి మెగాస్టార్ సినిమాలో నటించడానికి దేవసేన ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

First Published:  24 April 2019 5:36 AM GMT
Next Story