బిగ్ బాస్ 3 కోసం బాబాయా? అబ్బాయా?

తెలుగులో పాపులర్ అయిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడవ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 1 కోసం హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. అలాగే రెండవ సీజన్ కోసం న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా మారాడు. అయితే మూడవ సీజన్ కోసం ఇద్దరు బిజీగా ఉండటంతో మరొక హీరోని తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి బిగ్ బాస్ సీజన్ 3 లో ఎవరు వ్యవహరించబోతున్నారు అనే విషయం పై బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి.

తాజాగా అక్కినేని నాగార్జున ని సంప్రదించారు. కానీ నాగ్ మాత్రం ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. దీంతో బిగ్ బాస్ మేకర్లు మరో ఇద్దరు హీరోలను సంప్రదించాలని చూస్తున్నారట. వారు ఎవరో కాదు దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ మరియు రానా. రానా ఇప్పటికే నంబర్ వన్ యారి అనే షోకి హోస్ట్ గా వ్యవహరించాడు. కాబట్టి రానా కి హోస్ట్ గా చేయడం కొత్త కాదు. మరి ఈ బాబాయ్ అబ్బాయ్ ల లో బిగ్ బాస్ 3 ఎవరిని వరిస్తుందో చూడాలి.