Telugu Global
NEWS

చంద్రబాబూ.... వాళ్లను మాట్లాడనివ్వు, అన్నీ నువ్వే తేల్చేస్తే ఎలా!

‘కేరళలో ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయ్.. యూపీలో ఈవీఎంలను హ్యాక్ చేసేశారు.. అంతా బీజేపీ కుట్ర.. ఇవి ఎన్నికలే కాదు..’ ఇదీ వరస. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇదే తీరున మాట్లాడుతూ ఉన్నారు. ఏపీలో చెప్పిన డైలాగులనే చంద్రబాబు నాయుడు అంతటా చెబుతూ ఉన్నారు. మహారాష్ట్రలో కూర్చుని చంద్రబాబు నాయుడు…. కేరళ, యూపీల్లో ఎన్నికలు జరిగిన తీరుపై తన రన్నింగ్ కామెంట్రీ చెబుతూ ఉన్నారు. ఈ కామెంట్రీలో కొత్తదనం ఏమీ లేదు. అంతకు ముందు ఏం చెప్పాడో…. […]

చంద్రబాబూ.... వాళ్లను మాట్లాడనివ్వు, అన్నీ నువ్వే తేల్చేస్తే ఎలా!
X

‘కేరళలో ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయ్.. యూపీలో ఈవీఎంలను హ్యాక్ చేసేశారు.. అంతా బీజేపీ కుట్ర.. ఇవి ఎన్నికలే కాదు..’ ఇదీ వరస. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇదే తీరున మాట్లాడుతూ ఉన్నారు.

ఏపీలో చెప్పిన డైలాగులనే చంద్రబాబు నాయుడు అంతటా చెబుతూ ఉన్నారు. మహారాష్ట్రలో కూర్చుని చంద్రబాబు నాయుడు…. కేరళ, యూపీల్లో ఎన్నికలు జరిగిన తీరుపై తన రన్నింగ్ కామెంట్రీ చెబుతూ ఉన్నారు. ఈ కామెంట్రీలో కొత్తదనం ఏమీ లేదు.

అంతకు ముందు ఏం చెప్పాడో…. ఇప్పుడూ అదే చెబుతున్నాడు తెలుగుదేశం అధినేత.

ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయని, ఈవీఎంలను బీజేపీ వాళ్లు హ్యాక్ చేశారని బాబు అంటున్నారు. ఈ వాదనంతా ఏపీలో వినిపిచిందే. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం అని సీఈసీ అంటోంది. ఈ విషయంలో తాము చాలెంజ్ చేశామని, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.

అయితే అప్పుడు చంద్రబాబుకు బీజేపీకి సన్నిహితుడు. అప్పుడు ఈవీఎంలు మంచివి. ఇప్పుడు మాత్రం తను ఓడిపోయే అవకాశాలు ఉండటంతో ఈవీఎంలు చెడ్డవని బాబు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈవీఎంల తీరు గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.

అయినా ఇక్కడ మరో సందేహం కూడా రానే వస్తుంది. అదేమంటే.. కేరళ, యూపీ వంటి రాష్ట్రాల్లో వివిధ పార్టీలు పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ తో సహా కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు ఆయా రాష్ట్రాల్లో పోటీలో ఉన్నాయి. మరి ఈవీఎంలు ట్యాంపర్ జరిగినా, మరేమైనా తేడాలు వచ్చినా ఆపార్టీల తరఫున నేతలు ఊరికే ఉండరు. గగ్గోలు పెడతారు. ఆయా పార్టీల్లో మహా మహా మేధావులు, ముదుర్లు ఉన్నారు. ఏమైనా తేడా కొడితే వాళ్లంతా రోడ్డుకు ఎక్కుతారు. ఈవీఎంల మీద బీజేపీ డొక్క చీల్చి వాళ్లు డోలు కడతారు.

అయితే సదరు పార్టీల నేతలు ఈవీఎంల గురించి పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఏవో కొన్ని రొటీన్ డైలాగులే తప్ప వాళ్ళెవ్వరూ గగ్గోలు పెట్టలేదు చంద్రబాబు లాగా. వారంతా అలా కామ్ గా ఉన్నా…. చంద్రబాబు మాత్రం ఇలా అరుస్తూనే ఉన్నారు. ఈయన ఇలా ఆరుస్తున్నా… వారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓడిపోయే వాళ్లకు ఈవీఎంలతో భయం కానీ, అందరికీ ఉండదు కదా! అని ఈ పరిణామంపై పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!

First Published:  24 April 2019 4:54 AM GMT
Next Story