‘బన్నీ’కి విలన్ గా హన్సిక !

ఎప్పుడో కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తరువాత హన్సికకు మంచి పేరే వచ్చింది. చాలామంది పెద్ద హీరోలతో నటించే అవకాశం కూడా దక్కింది.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్, సిద్ధార్థ్, గోపిచంద్ వంటి చాలామంది హీరోలతో నటించి సక్సెస్ అందుకుంది. కానీ కొంత కాలంగా తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది ఈ భామ.

తాజాగా మళ్ళీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది హన్సిక కి అని సమాచారం. అయితే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ పాత్ర కాదని, నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రని తెలుస్తోంది.

ఈ విలన్ పాత్రకు ఆమెను సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. బన్నీ, వేణు శ్రీరామ్ చిత్రంలో ఈమె కనిపించబోతోంది అన్నమాట.

‘ఐకాన్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర కు ప్రధాన్యత ఎక్కువ ఉంటుందని, అందుకే హన్సిక కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ మొదటి సినిమా అయిన ‘ఓ మై ఫ్రెండ్’ లో కూడా హన్సిక హీరోయిన్ గా నటించింది అని తెలిసిందే.