తనతో విడిపోయా అంటున్న ‘ఫిదా’ నటుడు

హర్షవర్ధన్ రానే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. ‘తకిట తకిట’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హర్షవర్ధన్ రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును’ సినిమాతో పాపులర్ అయ్యాడు. అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హర్షవర్ధన్  తెలుగులో గతేడాది విడుదలైన ‘కవచం’ సినిమాలో కనిపించాడు.

అయితే గత కొంతకాలంగా హర్షవర్ధన్ నటి కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఖడ్గం’ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పాటతో ఆమె బాగానే పాపులర్ అయింది.

ఒకప్పుడు యువరాజ్ సింగ్ తో డేటింగ్ చేసి తరువాత అలీ పుంజాని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న కిమ్ శర్మ తాజాగా హర్షవర్ధన్ రానే తో కూడా విడిపోయినట్లు గా తెలుస్తోంది.

ఈ విషయాన్ని హర్షవర్ధన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వారిద్దరి పేర్లలో ని మొదటి అక్షరాలు కె,హెచ్ లను వాడి “థాంక్యూ. చాలా అద్భుతంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ మీ టూ. బై” అని ఇండైరెక్టుగా కిమ్ శర్మతో తను విడిపోయినట్లు గా పోస్ట్ చేశాడు హర్షవర్ధన్.