పంజాబ్ కు బెంగళూరు టెన్షన్

  • చిన్నస్వామి స్టేడియంలో బిగ్ ఫైట్
  • కింగ్స్ పంజాబ్ కు బెంగళూరు రాయల్ చాలెంజ్

ఐపీఎల్ 12వ సీజన్ 11వ రౌండ్ సమరానికి….కింగ్స్ పంజాబ్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటే సై అంటున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ కొహ్లీ నాయకత్వంలోని  బెంగళూరు చెలగాటం… అశ్విన్ నాయకత్వంలోని పంజాబ్ కు ప్లేఆఫ్ సంకటంగా మారింది.

గత రెండుమ్యాచ్ ల్లో వరుస విజయాలతో దూకుడుమీదున్న బెంగళూరు ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో 3 విజయాలు, 7 పరాజయాల రికార్డుతో ప్లే ఆఫ్ రౌండ్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకొంది.

అయితే…కెప్టెన్ కొహ్లీ, మాజీకెప్టెన్ డివిలియర్స్ , పార్థివ్ పటేల్ లాంటి ఆటగాళ్ల దూకుడుతో పుంజుకొని …గత రెండు రౌండ్ల మ్యాచ్ ల్లో కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై సంచలన విజయాలు సాధించింది.

కింగ్స్ పంజాబ్ మాత్రం 10 రౌండ్లలో 5 విజయాలు, 5 పరాజయాలతో పాటు 10 పాయింట్లతో లీగ్ టేబుల్ ఐదోస్థానంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ మ్యాచ్ లో నెగ్గితేనే …ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది. ఈమ్యాచ్ హైస్కోరింగ్ తో సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.