Telugu Global
NEWS

ఐపీఎల్ -12 ప్లే ఆఫ్ రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్

11వ రౌండ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై విజయం వాట్సన్ మెరుపుల్లో హైదరాబాద్ గల్లంతు ఐపీఎల్ -12వ సీజన్ ప్లేఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టు ఘనతను డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకొంది. హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ నెగ్గటంలో రికార్డు…. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో…ఆతిథ్య చెన్నై టాస్ […]

ఐపీఎల్ -12 ప్లే ఆఫ్ రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్
X
  • 11వ రౌండ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై విజయం
  • వాట్సన్ మెరుపుల్లో హైదరాబాద్ గల్లంతు

ఐపీఎల్ -12వ సీజన్ ప్లేఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టు ఘనతను డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకొంది. హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

టాస్ నెగ్గటంలో రికార్డు….

ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో…ఆతిథ్య చెన్నై టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుత సీజన్లో టాస్ నెగ్గటం ఇది వరుసగా ఎనిమిదోసారి. టాస్ నెగ్గటంలో సైతం ధోనీ ..అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు.

వార్నర్- బెయిర్ స్టోలతో బ్యాటింగ్ మొదలు పెట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగుల స్కోరు సాధించింది.

వార్నర్ పాంచ్ పటాకా…

ప్రస్తుత సీజన్లో సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ …సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా …వరుసగా ఐదో హాఫ్ సెంచరీ సాధించాడు.45 బాల్స్ లో 3 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 57 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

వన్ డౌన్ మనీష్ పాండే 49 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 83 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో…సన్ రైజర్స్…ప్రత్యర్థి ఎదుట 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

వాట్సన్ బాదుడే బాదుడు…

176 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభఓవర్లలోనే ఓపెనర్ డూప్లెసీ వికెట్ నష్టపోయినా….మరో ఓపెనర్ వాట్సన్, వన్ డౌన్ సురేశ్ రైనాల ఎదురుదాడితో తేరుకోగలిగింది. పవర్ ప్లే ఓవర్లలోనే మెరుగైన రన్ రేట్ సాధించగలిగింది.

వాట్సన్ కేవలం 53 బాల్స్ లోనే 9 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 96 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన 11 ఇన్నింగ్స్ లో వార్నర్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

చివరకు మరో బంతి మిగిలిఉండగానే సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. ప్లే ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

సూపర్ కింగ్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ వాట్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

11రౌండ్లలో 8 విజయాలు, 16 పాయింట్లు…

ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 11 రౌండ్ల మ్యాచ్ ల్లో 8 విజయాలు, 3 పరాజయాలతో మొత్తం 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఇద్దరూ ఇద్దరే….

ఐపీఎల్ 11వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి…బ్యాటింగ్ లో హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, బౌలింగ్ లో ఢిల్లీ ఓపెనింగ్ బౌలర్ కిర్గిసో రబాడా అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు.

వార్నర్ మొత్తం 10 ఇన్నింగ్స్ లో 574 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సైతం ఉన్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వార్నర్… ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.

బౌలింగ్ లో రబాడా 11 మ్యాచ్ లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను రబాడా సాధించాడు.

First Published:  24 April 2019 4:53 AM GMT
Next Story