కేఏపాల్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?

ఎన్నికలు ముగిశాయి. ఏపీలో రాజకీయ నేతలందరూ రిలాక్స్ అవుతున్నారు. మే 23న ఓటర్లు నేతల భవితవ్యాన్ని చెప్పబోతున్నారు. ప్రస్తుతం ఈవీఎంలలో వారి తీర్పు నిక్షిప్తమై ఉంది. అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తూ సేదతీరుతున్నారు. ఇక ఎన్నికల వేళ ప్రచార హోరులో కామెడీ పంచిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఏపీలో కనిపించడం లేదు. ఆయన ఏమై పోయాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

తెలుగులోని టాప్ న్యూస్ చానెల్స్ అన్నీ ఓవైపు ఎన్నికల వేడిలో ఆసక్తికర కథనాలను అందిస్తూ అందరూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెంట పడ్డారు. రేటింగ్ కోసం ఆయన చేసే సీరియస్ కామెడీని జనాలకు పంచారు. యూట్యూబ్ స్టార్ ను చేశారు. ఎన్నికల ప్రచారవేళ కేఏ పాల్ చేసిన హంగామా, జోకులు, కామెడీ అంతా ఇంతాకాదు.. ఏపీ ఎన్నికల వేడిలో ఇవి జనాలకు సేదతీర్చాయి. ఇలా పొలిటికల్ ఎంటర్ టైనర్ గా మారిన కేఏ పాల్ ఎన్నికలు ముగియగానే కనిపించకుండా పోయారు.

కేఏ పాల్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఎన్నికల వేళ విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రెగ్యులర్ గా తన టీంమేట్స్, సహచరులతో లైవ్ లోకి వచ్చి చాట్ చేస్తున్నారు. తన ప్రజాశాంతి పార్టీ 2019 ఎన్నికల్లో గెలవడం ఖాయమని భరోసానిస్తున్నారు.

అయితే ఇది అందరికీ కామెడీ అనిపించినా కొన్ని ఓట్లు అయితే కేఏ పాల్ చీల్చడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ కు పడే ఓట్లను పాల్ చీల్చేశాడని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మరి తుది ఫలితం ఎలా ఉంటుందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.