మహర్షి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వివరాలు

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాకు సంబంధించి అసలైన సందడి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు. మే 1న మహర్షి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున జరగబోతోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు.

మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అందుకే ఆ సెంటిమెంట్ కొద్దీ, మహర్షి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా కుదిరితే ఎన్టీఆర్ నే మరోసారి గెస్ట్ గా పిలవాలని అంతా భావిస్తున్నారట. దీనిపై ఇంకా మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొందరు యూనిట్ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ కాకుండా, మరో స్టార్ హీరోను పిలిస్తే బాగుంటుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా, మరోవైపు ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం దశలవారీగా సాగిపోతూనే ఉంది. ఇప్పటికే 3 పాటలు విడుదలవ్వగా అవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. తాజాగా నాలుగో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట కూడా రొటీన్ గానే ఉంది. ఉన్నంతలో కాస్త ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందంటే అది శంకర్ మహదేవన్ గాత్రం మాత్రమే. సినిమాకు సంబంధించి మరో 3 పాటలున్నాయట. వాటిని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు.