ఇంటర్‌ ఫలితాల గందరగోళం… టీడీపీ ఆడుకుంటోంది…

ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే దెబ్బతగిలినందుకు కాదట.. తోటికోడలు నవ్వినందుకు అన్నదట వెనుకటికి ఒక ఆవిడ.. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కారు వైఫల్యం కూడా టీడీపీ బ్యాచ్ పండుగ చేసుకుంటోంది.

కేసీఆర్ అసమర్థను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు మొదలుపెట్టింది. దీనిపై ట్రోల్ చేస్తున్న వారు మీరున్న తెలంగాణలో జరుగుతున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించండని కౌంటర్లు వేస్తున్నారు.

తాజాగా పోసాని, ఫృథ్వీ, జీవితా రాజశేఖర్, శివాజీ రాజ లాంటి వాళ్లను టీడీపీ బ్యాచ్ ట్రోల్స్ చేస్తూ తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో కేసీఆర్ సర్కారు వైఫల్యాన్ని ఎందుకు ఎత్తి చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇక కేసీఆర్ సర్కారు వైఫల్యాన్ని కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళుతున్నాయి. పక్కరాష్ట్రం వైఫల్యాన్ని తమ విజయంగా చెప్పుకుంటూ వికట్టహాసం చేస్తున్నాయి.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో కూడా బాబు ఇలానే చేసిన కుట్రలకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఇప్పుడు అదే డ్రామాలకు బాబు తెరతీశాడు.

ఏపీలో ఇంటర్ ఫలితాలు, ఎంసెట్ చక్కగా సాగుతున్నాయని.. తెలంగాణలో వైఫల్యం కనపడుతోందని ఎద్దేవా చేస్తోంది. మరి కేసీఆర్ ఈ తాజా విమర్శలకు ఎలాంటి ప్రతిస్పందన ఇస్తాడన్నది వేచిచూడాలి.