అన్నయ్య కి హాండ్ ఇచ్చాడు…. మరి తమ్ముడికి?

అక్కినేని అఖిల్ … అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేసి తన లక్ ని పరీక్షించుకున్నాడు. మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అవ్వడంతో….. ఇప్పుడు నాలుగో సినిమా పైన దృష్టి పెట్టాడు. బొమ్మరిల్లు సినిమాతో అరంగేట్రం చేసిన దర్శకుడు భాస్కర్ ఈ సినిమా కి దర్శకుడు. అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఈ సినిమా తో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్నాడట అఖిల్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మొదట దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడి గా అనుకున్నారు. కానీ ఈ సినిమాని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేద్దామని అనుకుంటున్నాడట అల్లు అరవింద్. అందుకే భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే దేవిని పక్కన పెట్టి గోపి సుందర్ ను తీసుకుంటున్నారట.

గోపిసుందర్ ఇటీవలే నాగ చైతన్య మజిలీ కి సంగీత అందించాడు…. కానీ ఆ సినిమా ని మధ్యలో నే వదిలి పెట్టాడు. ఈ సారి అఖిల్ సినిమా కి పూర్తిగా ఉంటాడా లేదా అనేది చూడాలి.