బన్నీ-త్రివిక్రమ్ సినిమా కాస్టింగ్ పై క్లారిటీ

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు సంవత్సరకాలం పాటు ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో ఉంచి ఎట్టకేలకు తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతోందని ప్రకటించాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా ఇది.

తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచే మొదలైంది. తాజాగా ఈ సినిమాలో కనిపించబోతున్న నటీనటులపై క్లారిటీ వచ్చింది.

‘డీజే’ సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించబోతోంది. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న టబు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనుంది. రాజేంద్రప్రసాద్, సత్య రాజ్, సునీల్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, రావు రమేష్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.