Telugu Global
NEWS

మసకబారుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠ...!

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోనూ కూడా అసంతృప్తి పెరిగింది. అలాగే […]

మసకబారుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠ...!
X

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోనూ కూడా అసంతృప్తి పెరిగింది.

అలాగే మంత్రివర్గ విస్తరణ కంటే ముందే తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలోనూ, ప్రజల్లోనూ అసంతృప్తికి కారణం అయిందని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి తెలంగాణ ఉద్యమంలోనూ అహర్నిశలు కష్టపడ్డ హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా అసంతృప్తికి ఓ కారణంగా చెబుతున్నారు.

తాజాగా రెవెన్యూ శాఖను మరో ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తామని ప్రకటించడం, రెవెన్యూ ఉద్యోగులు అందరూ లంచగొండులు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి అని అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమం సమయంలో పనికొచ్చిన ఉద్యోగులు ఇప్పుడు పనికిరాకుండా పోయారా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడిలో జరిగిన అవకతవకల వల్ల కూడా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందంటున్నారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల వల్ల దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రభుత్వ తప్పిదాలే ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని పార్టీ నాయకులే చెబుతున్నారు.

రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపే ఈ పరిస్థితి రావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే అని విమర్శిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి పరిణామాలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని చెబుతున్నారు.

First Published:  24 April 2019 9:36 PM GMT
Next Story