భారత క్రికెట్ మక్కాలో డూ ఆర్ డై ఫైట్

  • కోల్ కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ
  • రాత్రి 8 గంటలకు హైఓల్టేజ్ ఫైట్

ఐపీఎల్ 11వ రౌండ్ సమరానికి…భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో రంగం సిద్ధమయ్యింది.

రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ కు మాత్రమే కాదు… రాజస్థాన్ రాయల్స్ కు సైతం డూ ఆర్ డై గా మారింది. ప్లే ఆఫ్ రౌండ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే…ఈ మ్యాచ్ లో నెగ్గి తీరాల్సి ఉంది.

ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లు మాత్రమే సాధించిన కోల్ కతా…మిగిలిన నాలుగురౌండ్లలోనూ నెగ్గగలిగితేనే …ఆఖరి నాలుగు జట్లలో మిగిలే అవకాశం ఉంటుంది.

మరోవైపు ..మొదటి 10 రౌండ్లలో కేవలం 3 విజయాలతో 6 పాయింట్లు మాత్రమే సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరిస్థానానికి దిగజారిపోయింది.

ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే… కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు 10-9 తో ఆధిక్యంలో ఉంది.

వరుసగా ఐదుమ్యాచ్ ల్లో ఓడిన కోల్ కతా… పరాజయపరంపరకు తెరదించాలన్న పట్టుదలతో ఉంది.