బాలీవుడ్ కి రష్మిక?

‘ఛలో’ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘గీతగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా హ్యాపెనింగ్ బ్యూటీ గా మారిపోయింది రష్మిక మందన్న.

ఇక ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా మే 31న విడుదల కాబోతోంది.

అయితే తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ దర్శకుడు రష్మిక మందన్న ను తన సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ‘రామ్ లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలి ఏరికోరి సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భన్సాలి రణదీప్ హూడా హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రష్మిక మందన్న ఈ సినిమాను ఒప్పుకుంటుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.