Telugu Global
NEWS

కేసీఆర్ పై వీడియో.... ఏపీ స్టూడెంట్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ ను అవమానించేలా ఒక వీడియోను రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడని గుర్తించి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 20 ఏళ్ల డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కేసీఆర్ పై అభ్యంతరకర వీడియోను టిక్ టాక్ లో లోడ్ చేసి దాన్ని షేర్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని తిరువూరు గ్రామానికి చెందిన తగరం నవీన్ […]

కేసీఆర్ పై వీడియో.... ఏపీ స్టూడెంట్ అరెస్ట్
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ ను అవమానించేలా ఒక వీడియోను రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడని గుర్తించి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

20 ఏళ్ల డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కేసీఆర్ పై అభ్యంతరకర వీడియోను టిక్ టాక్ లో లోడ్ చేసి దాన్ని షేర్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని తిరువూరు గ్రామానికి చెందిన తగరం నవీన్ అనే విద్యార్థిని హైదరాబాద్ శివారులో రాచకొండ పొలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 సెక్షన్ 67 కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం విద్యార్థిపై అభియోగాలు మోపారు. అతడు వాడుతున్న రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు.

‘ఈ విద్యార్థి టిక్ టాక్ లో చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రజలపై అవమానకరమైన భాషను సదరు విద్యార్థి ఉపయోగించి అవమానకర, అభ్యంతరకర భాషను ఉపయోగించి దూషించాడు…. అందుకే కేసునమోదు చేశాం’ అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ పేర్కొన్నారు. ఈ వీడియోను సదురు విద్యార్థి ఏప్రిల్ 14న అప్ లోడ్ చేశాడని వివరించాడు.

తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు వి. రామనర్సింహా గౌడ్ ఫిర్యాదు మేరకు వీడియో షేర్ చేసిన నవీన్ పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  25 April 2019 12:50 AM GMT
Next Story